ప్రజ్వల్‌కు లైంగిక సామర్థ్య పరీక్షలు

  • ప్రజ్వల్ లైంగిక సామర్థ్య పరీక్షలకు అనుమతించిన కోర్టు 
  • బౌరింగ్ ఆసుపత్రిలో పరీక్షలు
  • నేటితో ముగియనున్న ప్రజ్వల్ సిట్ కస్టడీ
  • కస్టడీ పొడిగించాలని న్యాయస్థానాన్ని కోరనున్న సిట్
లైంగిక దౌర్జన్యం కేసులో అరెస్టయిన హసన్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు లైంగిక సామర్థ్య పరీక్షలు చేయించేందుకు న్యాయస్థానం అనుమతించింది. దీంతో, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు ఆయనకు బౌరింగ్ ఆసుపత్రిలో పరీక్షలు చేయించారు. మొత్తం మూడు పరీక్షలు చేయించినట్టు పోలీసులు తెలిపారు. అయితే, ప్రజ్వల్ విచారణకు సహకరించకపోవడంతో పోలీసులు ఇబ్బంది పడుతున్నారు. 

మరోవైపు, కొందరు ప్రజ్వల్ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టుల ద్వారా విక్రయించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని సిట్, పోలీసులు గుర్తించారు. పెన్ డ్రైవ్‌లు, ఇతర విధానాల్లో వీడియోలను పంచుకున్నా, విక్రయించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

ప్రజ్వల్ సిట్ కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో, అతడిని న్యాయస్థానం ముందు హాజరుపరుస్తామని సిట్ పేర్కొంది. మరోసారి తమకు కస్టడీ ఇప్పించాలని కోరతామని సిట్ అధికారులు పేర్కొన్నారు. ఇక లోక్‌సభ ఎన్నికల్లో అపజయంతో ప్రజ్వల్ రాజకీయ జీవితం దాదాపుగా ముగిసింది. మాజీ ప్రధాని దేవెగౌడ అండదండలతో చిన్న వయసులోనే ఎంపీ బాధ్యతలు చేపట్టిన ఆయన అశ్లీల వీడియోలు బయటపడటంతో ఈ ఎన్నికల్లో ఓడిపోయారు.


More Telugu News