అణ్వాయుధ ప్రయోగానికి మేము వెనకాడబోము: రష్యా అధ్యక్షుడు పుతిన్
- సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు అన్ని మార్గాలు అనుసరిస్తామన్న పుతిన్
- పలు సందర్భాల్లో అణుప్రయోగానికి రష్యా విధానాలు అనుమతిస్తాయని వెల్లడి
- తమ హెచ్చరికలను తేలిగ్గా తీసుకోవద్దని స్పష్టీకరణ
సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునేందుకు అణ్వాయుధ ప్రయోగానికి తాము వెనకాడబోమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ఉక్రెయిన్ తో జగడం అణుయుద్ధాలకు దారి తీస్తుందా? అన్న ప్రశ్నకు ఆయన బుధవారం ఈ మేరకు సమాధానం ఇచ్చారు. బుధవారం ఆయన సెయింట్ పీటర్స్ బర్గ్‌లో అంతర్జాతీయ మీడియా ప్రతినిధులతో పత్రికా సమావేశం నిర్వహించారు.
అణు యుద్ధం పేరిట రష్యా భయోత్పాతం సృష్టిస్తోందంటూ అమెరికా తప్పుడు ఆరోపణలు చేస్తోందని పుతిన్ మండిపడ్డారు. వాస్తవానికి రెండో ప్రపంచయుద్ధంలో అణ్వాయుధాన్ని వాడింది అమెరికాయేనని ఆయన గుర్తు చేశారు. అయితే, ముప్పు పొంచి ఉన్నప్పుడు అణ్వాయుధ ప్రయోగానికి రష్యా చట్టాలు అనుమతిస్తాయని ఆయన తెలిపారు. ‘‘అణ్వాయుధ ప్రయోగానికి సంబంధించి రష్యాకు ఓ విధానం ఉంది. మా ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వం ప్రమాదంలో పడినప్పుడు మేము అణ్వాయుధాలు సహా అన్ని ప్రత్యామ్నాయాలను అనుసరిస్తాం. ఈ హెచ్చరికలను తేలిగ్గా తీసుకోవద్దు’’ అని పుతిన్ అన్నాడు.