టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా గెలుపు బోణీ

  • గ్రూప్-ఏ మ్యాచ్ లో టీమిండియా × ఐర్లాండ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
  • 16 ఓవర్లలో 96 పరుగులకు ఐర్లాండ్ ఆలౌట్
  • 12.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా
రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా విజయంతో టీ20 వరల్డ్ కప్ ప్రస్థానం ప్రారంభించింది. న్యూయార్క్ లోని నసావు కౌంటీ స్టేడియంలో ఐర్లాండ్ తో జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్ లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 

ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు 16 ఓవర్లలో 96 పరుగులకు ఆలౌట్ అయింది. 97 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 12.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి ఛేదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ 52 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. రిషబ్ పంత్ 36 పరుగులతో జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. 

రోహిత్ శర్మ 4 ఫోర్లు, 3 సిక్సులు... పంత్ 3 ఫోర్లు, 2 సిక్సులు బాదారు. విరాట్ కోహ్లీ 1, సూర్యకుమార్ యాదవ్ 2 పరుగులు చేసి అవుటయ్యారు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అడైర్ 1, బెంజమిన్ వైట్ 1 వికెట్ తీశారు. టీమిండియా తన తదుపరి మ్యాచ్ ను జూన్ 9న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో ఆడనుంది.


More Telugu News