ఈ నెల 9న మోదీ ప్రమాణ స్వీకారం... 12న చంద్రబాబు ప్రమాణస్వీకారం!
- నేడు ఢిల్లీలో ముగిసిన ఎన్డీయే సమావేశం
- ఈ నెల 7న మరోసారి ఎన్డీయే భేటీ
- అదే రోజు రాష్ట్రపతిని కలవనున్న ఎన్డీయే పెద్దలు
- ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని కోరనున్న నేతలు
ఢిల్లీలో నేడు నరేంద్ర మోదీ నాయకత్వంలో జరిగిన ఎన్డీయే సమావేశం ముగిసింది. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. కాగా, ఈ నెల 7న మరోసారి ఎన్డీయే సమావేశం నిర్వహించనున్నారు.
బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం ఎన్డీయే భేటీ జరగనుంది. ఎన్డీయే సమావేశానికి కూటమి పార్టీల ఎంపీలందరూ హాజరు కావాలని నిర్ణయించారు. ఈ భేటీలో మంత్రివర్గ కూర్పు, శాఖలు, ఇతర అంశాలపై చర్చించనున్నారు. అదే రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని ఎన్డీయే నేతలు కోరనున్నారు.
కాగా, ఈ నెల 9న ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. అనంతరం ఈ నెల 12న ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని చంద్రబాబు యోచిస్తున్నారు. చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ కూడా హాజరయ్యే అవకాశాలున్నాయి.