హైదరాబాద్‌లో భారీ వర్షం... పలు మార్గాల్లో ట్రాఫిక్ జామ్
- గచ్చిబౌలి, ఖైరతాబాద్, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో వర్షం
- పలుచోట్ల రోడ్లపై పొంగిపొర్లిన నీరు
- మాదాపూర్ - కేపీహెచ్‌బీ, జూబ్లీహిల్స్ - హైటెక్ సిటీ మార్గంలో భారీ ట్రాఫిక్
హైదరాబాద్‌లో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లో మెయిన్ రోడ్లపై వర్షపు నీరు నిలిచి... ట్రాఫిక్ జామ్ అయింది. పలుచోట్ల రహదారులపై వర్షం నీరు పొంగిపొర్లింది. గచ్చిబౌలి, ఖైరతాబాద్, మాదాపూర్, మియాపూర్, కొండాపూర్, లింగంపల్లి, కూకట్ పల్లి, ఎర్రగడ్డ, పంజాగుట్ట, లక్డీకాపూల్, లిబర్టీ, ఎల్బీ నగర్, నాంపల్లి, హయత్ నగర్, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది.
పలుచోట్ల వర్షపు నీరు పొంగిపొర్లడం, ట్రాఫిక్ జామ్ కావడంతో జీహెచ్ఎంసీ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మాదాపూర్ నుంచి కేపీహెచ్‌బీ వెళ్లే మార్గంలో, జూబ్లీహిల్స్ నుంచి హైటెక్ సిటీ వెళ్లే మార్గంలో ట్రాఫిక్ జామ్ అయింది. మాదాపూర్ మైండ్ స్పేస్, ఐకియా, గచ్చిబౌలి బయోడైవర్సిటీ మార్గంలోనూ ట్రాఫిక్ జామ్ నెలకొంది.