వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు: విజయసాయి రెడ్డి
- జయాపజయాలతో సంబంధం లేకుండా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ
- సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానంటూ హామీ
- నెల్లూరు లోక్సభ నుంచి పోటీకి అవకాశం ఇచ్చిన వైఎస్ జగన్కు ప్రత్యేక ధన్యవాదాలంటూ ట్వీట్
నెల్లూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమిని చవిచూసిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి ఎన్నికల ఫలితాలపై మరోసారి స్పందించారు. నెల్లూరు లోక్సభకు పోటీ చేయడానికి అవకాశం ఇచ్చిన పార్టీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాల తెలియజేస్తున్నానంటూ బుధవారం ట్వీట్ చేశారు. జయాపజయాలతో సంబంధం లేకుండా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, సమస్యల పరిష్కారానికి, నెల్లూరు అభివృద్ధికి కృషి చేస్తానంటూ నెల్లూరు ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు.
ఇక నెల్లూరు లోక్సభ స్థానానికి పోటీ చేసిన తనకు మద్దతు ప్రకటించి, సహాయ సహకారాలు అందించిన నెల్లూరు ప్రజానీకానికి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు విజయసాయి రెడ్డి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా బుధవారం స్పందించారు.