నా బలం .. బలహీనత అదే: దర్శకుడు బాబీ
- 'లూసిఫర్' గురించి ప్రస్తావించిన బాబీ
- ఆ ప్రాజెక్టు తనకి వచ్చిందని వెల్లడి
- తన బలహీనత గురించిన వివరణ
- మెగాస్టార్ అర్థం చేసుకున్నారని వ్యాఖ్య
బాబీకి దర్శకుడిగా .. రచయితగా మంచి పేరు ఉంది. తన మార్క్ చూపిస్తూ ఆయన ముందుకు వెళుతున్నాడు. ఐడ్రీమ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తన గురించిన అనేక విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. ఆ మధ్య ఆయన నుంచి వచ్చిన 'వాల్తేరు వీరయ్య' సినిమా భారీ విజయాన్ని నమోదు చేసింది.
బాబీ మాట్లాడుతూ .. " మొదటి నుంచి కూడా నేను తయారు చేసుకున్న కథలను నేను బాగా చేయగలుగుతాను. ఎవరో రాసిన కథలలను నేను ఓన్ చేసుకోలేకపోతున్నాను .. అందువలన అవి విజయాన్ని సాధించలేకపోతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో 'లూసీఫర్' చేయమని చెప్పి నన్ను చిరంజీవిగారు పిలిపించారు. నా బలం .. నా బలహీనత ఏమిటనేది నేను చిరంజీవిగారికి చెప్పాను" అని అన్నారు.
'అయితే నువ్వు రాసిన కథను వినిపించు' అని చిరంజీవిగారు అన్నారు. ఒక్క 20 రోజులు సమయాన్ని ఇవ్వండి అని చెప్పి అడిగాను. ఆ తరువాత 'వాల్తేరు వీరయ్య' కథను రాసుకుని వెళ్లి చెప్పాను. ఆయనకి నచ్చడంతో ఆ ప్రాజెక్టు మొదలైంది. నా ఇబ్బంది ఏమిటనేది చిరంజీవిగారు అర్థం చేసుకోవడంవల్లనే అలా జరిగింది" అని చెప్పారు.