ఓటమి లేని జనసేన... స్ట్రయిక్ రేట్ 100

  • ఏపీ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి చోటా గెలిచిన జనసేన
  • 21 అసెంబ్లీ స్థానాల్లో జయభేరి
  • 2 ఎంపీ స్థానాలు కైవసం
  • గాజు గ్లాసు గుర్తును పర్మినెంట్ చేయనున్న ఎన్నికల సంఘం!
పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ ఏపీ ఎన్నికల్లో మహత్తర విజయాలు నమోదు చేసింది. పొత్తులో భాగంగా 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలకే పరిమితమైన ఆ పార్టీ... అనూహ్య రీతిలో పోటీ చేసిన ప్రతి చోటా విజయదుందుభి మోగించింది. 

ఓటమన్నదే లేని రీతిలో 21 అసెంబ్లీ స్థానాలకు 21... రెండు ఎంపీ స్థానాలకు రెండు ఎంపీ స్థానాల్లో గెలిచి రాజకీయ విశ్లేషకులను సైతం ఔరా అనిపించింది. తద్వారా 100 శాతం స్ట్రయిక్ రేట్ సాధించింది. 

గతంలో సరైన ఎన్నికల ప్రాతినిధ్యం లేకపోవడం, ఎన్నికల ప్రదర్శన అంతంతమాత్రంగా ఉండడం వంటి కారణాలను చూపి గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ గా పేర్కొన్న ఎన్నికల సంఘం... ఈసారి గాజు గ్లాసును జనసేనకు శాశ్వతం చేయనుంది.

జనసేన గెలిచిన ఎమ్మెల్యే స్థానాలు...
1. పాలకొండ- నిమ్మక జయకృష్ణ
2. నెల్లిమర్ల- లోకం నాగ మాధవి
3. విశాఖపట్నం సౌత్- వంశీకృష్ణ శ్రీనివాస్
4. అనకాపల్లి- కొణతాల రామకృష్ణ
5. పెందుర్తి- పంచకర్ల రమేశ్ బాబు
6. యలమంచిలి- సుందరపు విజయ్ కుమార్
7. పిఠాపురం- పవన్ కల్యాణ్
8. కాకినాడ రూరల్- పంతం నానాజీ
9. రాజోలు- దేవా వరప్రసాద్
10. గన్నవరం (ఎస్సీ)- గిడ్డి సత్యనారాయణ
11. రాజానగరం- బత్తుల బలరామకృష్ణ
12. నిడదవోలు- కందుల దుర్గేశ్
13. నరసాపురం- బొమ్మిడి నాయకర్
14. భీమవరం- పులపర్తి రామాంజనేయులు
15. తాడేపల్లిగూడెం- బొలిశెట్టి శ్రీనివాస్
16. ఉంగుటూరు- పి.ధర్మరాజు
17. పోలవరం- చిర్రి బాలరాజు
18. అవనిగడ్డ- మండలి బుద్ధప్రసాద్
19. తెనాలి- నాదెండ్ల మనోహర్
20. కోడూరు- అరవ శ్రీధర్
21. తిరుపతి- ఆరణి శ్రీనివాసులు

జనసేన  గెలిచిన ఎంపీ స్థానాలు...
1. మచిలీపట్నం- వల్లభనేని బాలశౌరి
2. కాకినాడ- తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్


More Telugu News