ఢిల్లీ బయల్దేరిన టీడీపీ అధినేత చంద్రబాబు
- సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీయే కూటమి
- నేడు ఢిల్లీలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశం
- హాజరుకావాలంటూ చంద్రబాబు, పవన్ లకు ఆహ్వానం
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఢిల్లీ బయల్దేరారు. చంద్రబాబు... జనసేనాని పవన్ కల్యాణ్ తో కలిసి ఇవాళ జరిగే ఎన్డీయే సమావేశానికి హాజరుకానున్నారు. లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ 16, జనసేన 2 స్థానాల్లో విజయం సాధించడం తెలిసిందే.
సరిగ్గా ఎన్నికల ముందే బీజేపీతో టీడీపీ పొత్తు కుదిరింది. దాంతో ఎన్డీయేలో చేరికకు టీడీపీకి మార్గం సుగమం అయింది. ఎన్డీయే భాగస్వామ్య పక్షాల తరఫున ప్రధాని మోదీ ఏపీకి వచ్చి ప్రచార సభల్లోనూ పాల్గొన్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి మరోసారి విజయం సాధించిన నేపథ్యంలో, నేడు ఢిల్లీలో జరిగే సమావేశానికి భాగస్వామ్య పక్షాల నేతలకు ఎన్డీయే పెద్దల నుంచి ఆహ్వానం అందింది. ఈ క్రమంలో ఈ ఉదయం మంగళగిరిలో మీడియా సమావేశం నిర్వహించిన చంద్రబాబు... తాము ఎన్డీయే కూటమిలో ఉన్నామని స్పష్టం చేశారు. అందుకే ఇవాళ ఢిల్లీ వెళుతున్నానని వెల్లడించారు.
కాగా, ఎన్డీయే సమావేశంలో పాల్గొననున్న చంద్రబాబు... ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిగా తన ప్రమాణస్వీకారానికి రావాలంటూ ప్రధాని మోదీ సహా ఎన్డీయే పెద్దలను చంద్రబాబు ఆహ్వానించనున్నారు.