ఓడిపోయినా జోష్ తగ్గలేదు.. ట్రోలర్లకు స్మృతి ఇరానీ జవాబు

  • పదేళ్లు గ్రామీణుల సేవలోనే గడిచిపోయాయని వ్యాఖ్య
  • గెలుపు ఓటములలో నా వెన్నంటి ఉన్న వారికి కృతజ్ఞతలు
  • సంబరాలు చేసుకుంటున్న వారికి అభినందనలు
  • జోష్ ఎలా ఉందన్న ప్రశ్నకు ఇప్పటికీ తగ్గేదేలేదన్న స్మృతి ఇరానీ
లోక్ సభ ఎన్నికల్లో అమేథీ నుంచి పోటీ చేసిన కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి కిశోర్ లాల్ శర్మ సంచలన విజయం నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తన ఓటమిపై స్మృతి ఇరానీ స్పందిస్తూ ఓ ట్వీట్ చేశారు. తన పదేళ్ల జీవితం గ్రామీణులకు సేవ చేయడంలోనే గడిచిపోయిందని, రోడ్లు ఇతర కనీస సదుపాయాల కల్పనలో రోజులు వేగంగా గడిచాయని చెప్పారు. ఈ పదేళ్లలో చేసిన ప్రజాసేవ తనకు సంతృప్తిని కలగజేసిందని వివరించారు.

తన ఈ ప్రయాణంలో ఎన్నో గెలుపు ఓటములు ఎదురయ్యాయని, అన్ని సందర్భాల్లోనూ తనతో పాటే ఉన్న వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని చెప్పారు. వారికి ఎన్నటికీ రుణపడి ఉంటానని పేర్కొన్నారు. లోక్ సభ ఫలితాల తర్వాత సంబరాలు జరుపుకుంటున్న వారికి అభినందనలు చెప్పారు. చివరగా.. తన ఓటమిని పరోక్షంగా ప్రస్తావిస్తూ ‘జోష్ ఎలా ఉంది మేడం’ అంటూ అడుగుతున్న వారికి స్మృతి ఇరానీ జవాబిచ్చారు. ఓడిపోయినా సరే జోష్ తగ్గలేదనే చెప్పారు. ఇప్పటికీ జోష్ చాలా హై లెవల్ లోనే ఉందని ట్రోలర్లను ఆమె కౌంటర్ ఇచ్చారు.


More Telugu News