పిల్లల ముందే తండ్రిని కాల్చి చంపిన యువకుడు.. సీసీకెమెరాలో రికార్డయి న ఘోరం
- మీరట్ లోని ఓ క్లబ్ లో చోటుచేసుకున్న దారుణ హత్య
- తుపాకీతో పాయింట్ బ్లాంక్ లో కాల్పులు
- అక్కడికక్కడే చనిపోయిన మీరట్ వాసి
పిల్లలతో కలిసి క్లబ్ కు వెళ్లిన ఓ వ్యక్తిని కాల్చి చంపాడో యువకుడు.. బాధితుడి పిల్లల ముందే, చుట్టూ జనం చూస్తుండగానే ఈ దారుణానికి పాల్పడ్డాడు. పాయింట్ బ్లాంక్ లో కాల్పులు జరిపి క్షణాల్లో మాయమయ్యాడు. ఇదంతా అక్కడున్న సీసీకెమెరాలో రికార్డు కాగా ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ వైరల్ గా మారింది. ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో జరిగిన ఈ దారుణానికి సంబంధించిన వివరాలు..
మీరట్ కు చెందిన అర్షద్ మంగళవారం సాయంత్రం తన పిల్లలతో కలిసి స్థానికంగా ఉన్న ఓ క్లబ్ కు వెళ్లాడు. ఇద్దరు కూతుళ్లు, ఓ కొడుకుతో స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతుంటే చూస్తూ ఓ పక్కన నిలుచున్నాడు. ఇంతలో అక్కడికి వచ్చిన బిలాల్ అనే యువకుడు అర్షద్ తో డబ్బు విషయంలో గొడవ పడ్డాడు. కొన్ని రోజులుగా అర్షద్, బిలాల్ మధ్య డబ్బుకు సంబంధించి గొడవ జరుగుతోంది. ఈ క్రమంలోనే క్లబ్ లో కూడా అదే విషయంపై ఇద్దరి మధ్యా మాటామాటా పెరిగింది. ఇంతలో బిలాల్ గన్ తీసి అర్షద్ పై కాల్పులు జరిపాడు. అతి సమీపంలో నుంచి కాల్పులు జరపడంతో అర్షద్ తలలోకి బుల్లెట్ దిగింది.. దీంతో నిలుచున్న చోటే కుప్పకూలాడు.
తండ్రి పడిపోవడంతో పిల్లలు ముగ్గురూ ఏడుస్తూ పరిగెత్తుకొచ్చారు. చుట్టుపక్కల వారి సాయంతో అర్షద్ ను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయాడని వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై క్లబ్ నిర్వాహకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించి కాల్పులు జరిపిన వ్యక్తిని బిలాల్ గా గుర్తించారు. బిలాల్ తో పాటు అర్షద్ పైనా గతంలో పలు క్రిమినల్ కేసులు నమోదయ్యాయని వివరించారు. పారిపోయిన బిలాల్ ను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.