బాలయ్య ఇంట ట్రిపుల్ ధమాకా
- ఏపీ ఎన్నికల్లో టీడీపీ సునామీ విజయాలు
- హిందూపురంలో హ్యాట్రిక్ కొట్టిన బాలకృష్ణ
- ఘనవిజయాలు అందుకున్న బాలయ్య అల్లుళ్లు
- మంగళగిరిలో నారా లోకేశ్ రికార్డు విజయం
- విశాఖ ఎంపీ స్థానంలో విజయభేరి మోగించిన 'గీతం' భరత్
ఏపీ ఎన్నికల్లో టీడీపీ సునామీ విజయం సాధించింది. జనసేన, బీజేపీలతో పొత్తు పెట్టుకున్నప్పటికీ, 135 స్థానాలు గెలిచి రాష్ట్రంలో పెద్ద పార్టీగా అవతరించింది. 25 లోక్ సభ స్థానాల్లో 21 టీడీపీ-జనసేన-బీజేపీ వశమయ్యాయి. ఈ సందర్భంగా అనేక విశేషాలు కూడా చోటుచేసుకున్నాయి.
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నందమూరి బాలకృష్ణ ఇంట ట్రిపుల్ ధమాకా నెలకొంది. బాలయ్య గెలవడమే కాదు ఆయన అల్లుళ్లు నారా లోకేశ్, 'గీతం' భరత్ కూడా విజయాలు సాధించారు. దాంతో బాలయ్య ఇంట సంబరాలు మామూలుగా లేవు.
సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ హిందూపురంలో హ్యాట్రిక్ కొట్టారు. వరుసగా మూడోసారి హిందూపురం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన 2014, 2019లోనూ ఇక్కడ్నించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. తాజా ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి టీఎన్ దీపికపై 32,597 ఓట్ల మెజారిటీతో బాలకృష్ణ విజయభేరి మోగించారు.
ఇక, ఆయన పెద్దల్లుడు నారా లోకేశ్ గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి ఓడిపోయినా, ఈసారి అదే నియోజకవర్గం నుంచి రికార్డు మెజారిటీతో గెలుపొందారు. నారా లోకేశ్ 91,413 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్యపై విజయం సాధించారు. టీడీపీ గెలిచిన అసెంబ్లీ స్థానాల పరంగా రాష్ట్రంలో ఇది మూడో అత్యధిక మెజారిటీ. 1985 తర్వాత మంగళగిరిలో టీడీపీ గెలిచిందంటే అది లోకేశ్ తోనే సాధ్యమైంది.
బాలకృష్ణ చిన్నల్లుడు, గీతం విద్యాసంస్థల నిర్వాహకుడు మతుకుమిల్లి శ్రీభరత్ విశాఖ ఎంపీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఘనవిజయం సాధించారు. భరత్ ఓడించింది ఎవరినో కాదు... వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అర్ధాంగి బొత్స ఝాన్సీలక్ష్మిని. భరత్ 5,04,247 ఓట్ల భారీ మెజారిటీతో బొత్స ఝాన్సీలక్ష్మిని ఓడించారు.