తెలంగాణలో ప్రారంభమైన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్

  • జనగామ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పల్లా
  • ఎమ్మెల్సీ పదవికి రాజీనామాతో ఉప ఎన్నిక
  • బరిలో కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి పైడి రాకేశ్‌రెడ్డి, బీజేపీ నుంచి గజ్జుల ప్రేమేందర్‌
తెలంగాణ 17 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో జీరో ఫలితాన్ని చవిచూసిన బీఆర్ఎస్ పార్టీ నేటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఫలితాలపై ఆశలు పెట్టుకుంది. ఇటీవల జరిగిన వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నిక ఫలితాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. 

లోక్‌సభ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న బీఆర్ఎస్ ఈ స్థానంలో గెలుపుపై ఆశలు పెట్టుకుంది. మహబూబ్‌నగర్ ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో విజయం సాధించిన బీఆర్ఎస్ ఇప్పుడు ఈ ఫలితం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ ఎన్నికలో అధికార పార్టీ కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి పైడి రాకేశ్‌రెడ్డి, బీజేపీ నుంచి గజ్జుల ప్రేమేందర్‌రెడ్డి పోటీలో ఉన్నారు. జనగామ ఎమ్మెల్యేగా గెలిచిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి రాజీనామాతో ఈ ఉప ఎన్నిక తప్పనిసరైంది.


More Telugu News