ఏపీ ఎన్నిక‌ల్లో భారీ మెజారిటీలు ఇవే..!

  • గాజువాక- ప‌ల్లా శ్రీనివాస్ (టీడీపీ)- 95, 235 
  • భీమిలి- గంటా శ్రీనివాస్- 92, 401
  • మంగ‌ళ‌గిరి నుంచి నారా లోకేశ్ 91, 413 ఓట్ల ఆధిక్యంతో విజ‌యం
  • పెందుర్తి- ర‌మేశ్ (జ‌న‌సేన)- 81, 870
ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల్లో టీడీపీ కూట‌మి ఘ‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. అధికార వైసీపీ ఘోర ఓట‌మి చ‌విచూసింది. వై నాట్ 175 అనే నినాదంతో బ‌రిలోకి దిగిన జ‌గ‌న్ నేతృత్వంలోని వైసీపీకి రాష్ట్ర ఓట‌ర్లు దిమ్మ‌తిరిగే ఫ‌లితాల‌ను క‌ట్ట‌బెట్టారు. 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి సునామీ సృష్టించిన ఆ పార్టీ.. ఈ సారి సైకిల్ స్పీడు ముందు తేలిపోయింది. దీంతో ఆ పార్టీ కేవ‌లం 11 స్థానాల‌తోనే స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. ఇక టీడీపీ కూట‌మి ఏకంగా 164 సీట్ల అఖండ మెజారిటీతో అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈ క్ర‌మంలో కూట‌మి అభ్య‌ర్థులు కొన్ని చోట్ల ఇంత‌కుముందెన్న‌డూ లేని విధంగా భారీ మెజారిటీలు సాధించ‌డం జ‌రిగింది. 

కూట‌మి అభ్య‌ర్థులు సాధించిన భారీ మెజారిటీలు
గాజువాక నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్య‌ర్థి ప‌ల్లా శ్రీనివాస్ ఏకంగా 95, 235 ఓట్ల తేడాతో గెలుపొందారు. అలాగే భీమిలి నుంచి గంటా శ్రీనివాస్-92, 401, మంగ‌ళ‌గిరి నుంచి నారా లోకేశ్-91, 413 ఆధిక్యంతో విజ‌యం సాధించారు. అటు పెందుర్తి నుంచి ర‌మేశ్ (జ‌న‌సేన)-81, 870, నెల్లూరు అర్బ‌న్ నుంచి నారాయ‌ణ (టీడీపీ)-72,489, త‌ణుకు నుంచి రాధాకృష్ణ (టీడీపీ)-72,121, కాకినాడ రూర‌ల్ నుంచి నానాజీ (జ‌న‌సేన)- 72,040, రాజ‌మండ్రి అర్బ‌న్ నుంచి శ్రీనివాస్ (టీడీపీ)- 71,404, పిఠాపురం నుంచి ప‌వ‌న్ క‌ల్యాణ్‌- 70, 279 ఓట్ల‌ భారీ మెజారిటీల‌ను న‌మోదు చేశారు.


More Telugu News