రాజకీయాల్లో మా అబ్బాయి పడిన కష్టాలకు దేవుడు మంచి ఫలితాన్నిచ్చాడు: పవన్ తల్లి అంజనా దేవి

  • పిఠాపురంలో పవన్ కల్యాణ్ విక్టరీ
  • తనయుడి విజయం పట్ల అంజనా దేవి హర్షం
  • ఇక రోజూ గాజు గ్లాసులోనే టీ తాగుతానంటూ వ్యాఖ్యలు
జనసేనాని పవన్ కల్యాణ్ పిఠాపురంలో జయకేతనం ఎగురవేయడం పట్ల ఆయన మాతృమూర్తి అంజనాదేవి స్పందించారు. తనయుడి విజయం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో మా అబ్బాయి పడిన కష్టాలకు ఆ దేవుడు మంచి ఫలితాన్ని ఇచ్చాడని అన్నారు. ఇక ఈ రోజు నుంచి గాజు గ్లాసులోనే టీ తాగుతాను అంటూ తన కుమారుడి గుర్తు అయిన గాజు గ్లాసును ప్రదర్శించారు. అందులో ఉన్న టీని హాయిగా తాగేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.


More Telugu News