ముగిసిన చంద్రబాబు, పవన్ సమావేశం

ముగిసిన చంద్రబాబు, పవన్ సమావేశం
  • ఏపీలో కూటమి విజయం
  • మంగళగిరిలో జనసేన పార్టీ ఆఫీసుకు వచ్చిన చంద్రబాబు
  • దాదాపు గంట పాటు చంద్రబాబు, పవన్ మధ్య చర్చలు
మంగళగిరిలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ మధ్య సమావేశం ముగిసింది. ఈ సాయంత్రం జనసేన కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు... అక్కడ పవన్ తో భేటీ అయ్యారు. ఇద్దరి మధ్య దాదాపు గంటకు పైగా చర్చలు జరిగాయి. కూటమి ఘనవిజయం నేపథ్యంలో నూతన ప్రభుత్వ ఏర్పాటు, ప్రమాణ స్వీకారంపై ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. రేపు ఢిల్లీలో ఎన్డీయే సమావేశానికి హాజరయ్యే అంశంపైనా చంద్రబాబు, పవన్ సమాలోచనలు జరిపారు. కాగా, చంద్రబాబు, పవన్ రేపు మరోసారి సమావేశమయ్యే అవకాశాలున్నాయి.


More Telugu News