వయనాడ్‌లో భారీ మెజారిటీతో గెలిచిన రాహుల్ గాంధీ

  • 3.6 లక్షల ఓట్ల మెజారిటీ దక్కించుకున్న కాంగ్రెస్ అగ్రనేత
  • 1,41,045 ఓట్లతో రెండో స్థానంలో నిలిచిన సీపీఐ అభ్యర్థి రాజా
  • 2019లోనూ ఇక్కడి నుంచి విజయం సాధించిన రాహుల్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఘన విజయం సాధించారు. సీపీఐ అభ్యర్థి రాజాపై రికార్డు స్థాయిలో 3,64,422 ఓట్ల తేడాతో గెలిచారు. రాహుల్ గాంధీకి మొత్తం 6,47,445 ఓట్లు రాగా, తన ప్రత్యర్థి రాజాకు 2,83,023 ఓట్లు పడ్డాయి. ఇక బీజేపీ అభ్యర్థి కే.సురేంద్రన్‌ 1,41,045 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. కాగా 2019లో కూడా రాహుల్ గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే.

ఇక 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఇక్కడి నుంచి 4,31,770 ఓట్ల తేడాతో గెలిచారు. ఇక్కడ ఆయనకు 706,367 ఓట్లు పడగా, అందులో 65 శాతం రాహుల్ గాంధీకే వచ్చాయి. 2,74,597 ఓట్లు పొందిన సీపీఐ అభ్యర్థి సునీర్‌ రెండో స్థానంలో నిలిచారు. మరోవైపు ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలి నుంచి కూడా రాహుల్ గాంధీ ఘన విజయం సాధించారు.


More Telugu News