కంచుకోట కుప్పంలో చంద్రబాబు ఘన విజయం

కంచుకోట కుప్పంలో చంద్రబాబు ఘన విజయం
  • ఏపీ ఎన్నికల్లో కుమ్మేసిన కూటమి
  • కుప్పంలో చంద్రబాబు వరుసగా ఎనిమిదో పర్యాయం విజయం
  • వైసీపీ అభ్యర్థి భరత్ పై గెలుపు
  • 1989 నుంచి చంద్రబాబుకు కంచుకోటగా కుప్పం
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుప్పం నియోజకవర్గంలో ఘన విజయం సాధించారు. తన సమీప వైసీపీ ప్రత్యర్థి కేఆర్ జే భరత్ పై చంద్రబాబు 47,340 ఓట్ల తేడాతో గెలుపొందారు. మొత్తం 18 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి చంద్రబాబుకు 1,20,926 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి భరత్ కు 73,585 ఓట్లు వచ్చాయి. 

టీడీపీ అధినేత చంద్రబాబుకు కుప్పం కంచుకోటగా ఉంది. ఆయన 1989 నుంచి ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఏడు పర్యాయాలు నెగ్గిన చంద్రబాబు... వరుసగా ఎనిమిదోసారి కూడా విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. 

గతంలో చంద్రగిరి నియోజకవర్గంలో ఓటమి తర్వాత చంద్రబాబు కుప్పం నియోజకవర్గానికి మారారు. అప్పటి నుంచి ప్రజలు ఆయనను ఆదరిస్తున్నారు.


More Telugu News