హిందూపురంలో నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్
- హిందూపురంలో బాలయ్యకు వరుసగా మూడో విజయం
- 2014, 2019 ఎన్నికల్లోనూ బాలకృష్ణ విజయం
- ఈసారి వైసీపీ అభ్యర్థి టీఎన్ దీపికపై జయకేతనం
టీడీపీ కంచుకోట అనదగ్గ హిందూపురం అసెంబ్లీ స్థానంలో నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ కొట్టారు. వరుసగా మూడోసారి కూడా విజయభేరి మోగించారు. తాజా ఎన్నికల్లో బాలయ్య తన సమీప వైసీపీ ప్రత్యర్థి టీఎన్ దీపికపై విజయం సాధించారు.
12 రౌండ్ల ఓట్ల లెక్కింపు అనంతరం బాలకృష్ణ 24,629 ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు. బాలయ్యకు 73,362 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి దీపికకు 48,733 ఓట్లు వచ్చాయి. ఇంకా ఇక్కడ మరో ఏడు రౌండ్ల లెక్కింపు మిగిలుంది.
2014, 2019 ఎన్నికల్లోనూ బాలకృష్ణ హిందూపురం అసెంబ్లీ స్థానంలో గెలిచిన సంగతి తెలిసిందే.
కాగా, హిందూపురం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన స్వామి పరిపూర్ణానందకు 12 రౌండ్ల వరకు కేవలం 1,240 ఓట్లు వచ్చాయి. పరిపూర్ణానంద నిన్న మీడియా సమావేశంలో మాట్లాడుతూ, జగన్ పార్టీకి 123 స్థానాలు వస్తాయని అంచనా వేశారు. కానీ ఆయన అంచనాలు దారుణంగా తల్లకిందులయ్యాయి.