పోటీ చేసిన రెండుచోట్లా గెలిచిన రాహుల్ గాంధీ
- వయనాడ్‌లో సీపీఐ అభ్యర్థిపై 3.5 లక్షల మెజార్టీతో విజయం
- రాయ్‌బరేలీ నుంచి 3.7 లక్షల మెజార్టీతో గెలిచిన కాంగ్రెస్ నేత
- హసన్ నుంచి ఓడిపోయిన ప్రజ్వల్ రేవణ్ణ
- తిరువనంతపురంలో కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌పై కాంగ్రెస్ అభ్యర్థి శశిథరూర్ విజయం
కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ తాను పోటీ చేసిన రెండు స్థానాలలో విజయం సాధించారు. కేరళలోని వయనాడ్ నుంచి రెండోసారి గెలిచారు. సమీప సీపీఐ అభ్యర్థి యానీ రాజాపై 3.5 లక్షల మెజార్టీతో గెలుపొందారు. ఉత్తర ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నుంచి 3.7 లక్షల మెజార్టీతో గెలిచారు.
ఇక కర్ణాటకలోని హసన్ నుంచి ఎన్డీయే కూటమి అభ్యర్థి ప్రజ్వల్ రేవణ్ణ ఓడిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి శ్రేయాస్ ఎం అయ్యర్ చేతిలో 43వేల మెజార్టీతో ఓడిపోయారు. తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి బీజేపీ అభ్యర్థి అన్నామలై రెండో స్థానంలో కొనసాగుతున్నారు. తిరువనంతపురంలో కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌పై కాంగ్రెస్ అభ్యర్థి శశిథరూర్ విజయం సాధించారు. ఇక్కడి నుంచి శశిథరూర్ వరుసగా నాలుగోసారి గెలిచారు.