అమేథీలో ఓటమి దిశగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ
- భారీ ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి కిశోరీ లాల్ శర్మ
- గతంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఓడించిన స్మృతి ఇరానీ
- కాంగ్రెస్‌కు కంచుకోటలో స్మృతికి ఈసారి భంగపాటు తప్పదా?
అమేథీలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ వెనుకంజలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కిశోరీ లాల్ శర్మ లక్షకు పైగా ఆధిక్యంలో ఉన్నారు. మొదటి రౌండ్ నుంచి ఇక్కడ ఆమె వెనుకంజలోనే ఉన్నారు. రెండో రౌండ్‌కు కాంగ్రెస్ అభ్యర్థికి మెజారిటీ పెరుగుతూ వస్తోంది.
గతంలో కాంగ్రెస్‌కు కంచుకోటగా భావించే అమేథిలో స్మృతి ఇరానీ.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఓడించారు. దీంతో ఈసారి కాంగ్రెస్ అధిష్ఠానం వ్యూహాత్మకంగా ఇందిరా గాంధీ కుటుంబానికి విధేయుడైన కిశోరీ లాల్ శర్మను అమేథీ నుంచి బరిలోకి దింపింది. ఇక అమేథీ నుంచి గెలుపు ఖాయమని మొదటి నుంచీ ధీమాగా ఉన్న స్మృతి ఇరానీకి ఈసారి భంగపాటు తప్పకపోవచ్చు.