చ‌రిత్ర సృష్టించిన నారా లోకేశ్‌

  • మంగ‌ళ‌గిరిలో విజ‌య‌ఢంకా మోగించిన లోకేశ్‌
  • ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ నియోజ‌క‌వ‌ర్గంలో 15 సార్లు ఎన్నిక‌లు
  • టీడీపీ కేవ‌లం రెండుసార్లు మాత్ర‌మే గెలిచిన వైనం
  • 1985లో టీడీపీ చివ‌రిగా విజయం
టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. మంగ‌ళ‌గిరిలో విజ‌య‌ఢంకా మోగించారు. స‌మీప ప్ర‌త్య‌ర్థి, వైసీపీ అభ్య‌ర్థి లావ‌ణ్య‌పై గెలిచారు. దీంతో టీడీపీ ద‌శాబ్ధాలుగా గెల‌వ‌ని మంగ‌ళ‌గిరి అసెంబ్లీ స్థానంలో ఆ పార్టీ జెండా ఎగ‌రేసి చ‌రిత్ర సృష్టించారు. ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ నియోజ‌క‌వ‌ర్గంలో 15 సార్లు ఎన్నిక‌లు జ‌రిగితే టీడీపీ కేవ‌లం రెండుసార్లు మాత్ర‌మే గెలిచింది. 1985లో చివ‌రిగా గెలిచింది. ఆ త‌ర్వాత ఇప్ప‌టివ‌ర‌కూ అక్క‌డ గెల‌వ‌లేదు. 

ఇక 2019లో లోకేశ్ పోటీ చేసి ఓడినా నియోజ‌క‌వ‌ర్గాన్ని అంటిపెట్టుకుని ఉండ‌టం ఇప్పుడు ఆయ‌న‌కు క‌లిసొచ్చింది. అలాగే నియోజ‌క‌వ‌ర్గంలో వివిధ సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డం ఆయ‌న‌పై ప్ర‌జ‌ల్లో సానుకూల‌త‌ను పెంచాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.  

విజయం సాధించిన ఎన్‌డీఏ అభ్యర్థులు
రాజమండ్రి గ్రామీణంలో టీడీపీ అభ్య‌ర్థి బుచ్చయ్యచౌదరి ఘనవిజయం
రాజమహేంద్రవరం నగరంలో టీడీపీ అభ్య‌ర్థి ఆదిరెడ్డి వాసు విజయం
కొవ్వూరులో టీడీపీ అభ్య‌ర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు విజయం
గాజువాకలో టీడీపీ అభ్య‌ర్థి పల్లా శ్రీనివాసరావు విజయం
పాలకొల్లులో టీడీపీ అభ్య‌ర్థి నిమ్మల 69 వేల ఓట్ల ఆధిక్యంతో విజయం
అనపర్తిలో బీజేపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విజయం
ఉరవకొండలో టీడీపీ అభ్య‌ర్థి పయ్యావుల కేశవ్‌ విజయం
మంగళగిరిలో నారా లోకేశ్‌ విజయం
ప్రొద్దుటూరులో టీడీపీ అభ్య‌ర్థి వరదరాజుల రెడ్డి విజయం


More Telugu News