సత్తెనపల్లిలో ఓటమి దిశగా మంత్రి అంబటి రాంబాబు

  • సత్తెనపల్లి నుంచి వైసీపీ అభ్యర్థిగా అంబటి రాంబాబు
  • టీడీపీ అభ్యర్థిగా కన్నా లక్ష్మీనారాయణ
  • 11 రౌండ్ల అనంతరం అంబటిపై 20,555 ఓట్ల ఆధిక్యంలో కన్నా
ఏపీ ఎన్నికల్లో ఎక్కువగా వినిపించిన పేర్లలో మంత్రి అంబటి రాంబాబు పేరు కూడా ఉంది. అంబటి రాంబాబు పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే, ఆయనకు సొంత నియోజకవర్గంలో ఈసారి భంగపాటు తప్పేలా లేదు. 

ఈ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా, ఆయనకు ఏ దశలోనూ ఆధిక్యం కనిపించలేదు. సత్తెనపల్లి అసెంబ్లీ స్థానంలో ఇప్పటివరకు 11 రౌండ్ల లెక్కింపు పూర్తి కాగా... టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ 20,555 ఓట్ల భారీ మెజారిటీతో ముందంజలో ఉన్నారు. 

11 రౌండ్ల వరకు కన్నాకు 69,116 ఓట్లు రాగా, అంబటికి 48,561 ఓట్లు వచ్చాయి. సత్తెనపల్లిలో ఇంకా 9 రౌండ్ల లెక్కింపు మిగిలుంది.


More Telugu News