బతకడం కోసం చాలా పనులు చేశాను: నవీన్ చంద్ర
- తనకి డాన్స్ అంటే ఇష్టమన్న నవీన్ చంద్ర
- అదే సినిమాల్లోకి తీసుకొచ్చిందని వెల్లడి
- ఇండస్ట్రీలో తెలిసినవారు లేరని వ్యాఖ్య
- పాత సినిమాలంటే ఇష్టమని వివరణ
నవీన్ చంద్ర .. మంచి హైటూ .. అందుకు తగిన పర్సనాలిటీ ఉన్న హీరో. 'అందాల రాక్షసి' సినిమాతో ఆయనకి మంచి క్రేజ్ వచ్చింది. ఆ తరువాత ఆయన కెరియర్ అనుకున్నంత ఫాస్టుగా పరిగెత్తలేదు. అయితే ఇప్పుడు మాత్రం ఒక వైపున సినిమాలతో .. మరో వైపున వెబ్ సిరీస్ లతో బిజీగానే ఉన్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన అనేక రకాల విషయాలను ప్రస్తావించాడు.
"మొదటి నుంచి కూడా నాకు డాన్స్ పై ఆసక్తి ఎక్కువగా ఉండేది. బళ్లారిలో నా డాన్స్ షోస్ చూడటానికి జనాలు విపరీతంగా వచ్చేవారు. దాంతో నా దృష్టి సినిమాలపైకి వెళ్లింది. ఇండస్ట్రీలో నాకు తెలిసినవారెవరూ లేరు. ఇక్కడ నిలబడేవరకూ ఒక ఇన్ కమ్ అనేది నాకు అవసరం. అందువలన కెఫెలో .. బిర్యానీ సెంటర్లో పనిచేశాను. డైలీ కలెక్షన్లు చూసుకునే పని కూడా చేశాను " అని అన్నాడు.
"నేను సినిమాల దిశగా రావడానికీ .. ఇక్కడ నిలదొక్కుకోవడానికి కొంత సమయం పట్టింది. ఇంకాస్త ముందుగావచ్చి ఉంటే నా కెరియర్ ఇంతకంటే బెటర్ గా ఉండేదేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సమయం ఉన్నప్పుడు నేను పాత సినిమాలను ఎక్కువగా చూస్తుంటాను. రేలంగి .. రమణారెడ్డి .. సూర్యకాంతం నటన అంటే నాకు చాలా ఇష్టం" అని చెప్పాడు.