బందరులో పేర్ని నాని తనయుడి పరిస్థితి ఇలా ఉంది...!
- బందరు నుంచి పేర్ని నాని తనయుడు పేర్ని కృష్ణమూర్తి పోటీ
- 15,001 ఓట్ల ముందంజలో ఉన్న టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర
- ఇప్పటివరకు 5 రౌండ్ల లెక్కింపు పూర్తి
ఏపీలో ఈసారి ఎన్నికల్లో ఆసక్తి రేకెత్తించిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో బందరు ఒకటి. మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే పేర్ని నాని ఈ పర్యాయం పోటీ నుంచి తప్పుకోగా, ఆయన కుమారుడు పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగారు. టీడీపీ నుంచి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఇక్కడ పోటీ చేశారు.
బందరు నియోజకవర్గంలో ఇప్పటివరకు 5 రౌండ్ల పాటు ఓట్ల లెక్కింపు పూర్తి కాగా, పేర్ని కృష్ణమూర్తి బాగా వెనుకబడిపోయారు. ఆయన కంటే టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర 15,001 ఓట్ల ముందంజలో ఉన్నారు.
ఐదు రౌండ్ల అనంతరం కొల్లు రవీంద్రకు 33,343 ఓట్లు రాగా, పేర్ని కృష్ణమూర్తికి 18,342 ఓట్లు వచ్చాయి. ఇంకా ఇక్కడ మరో 10 రౌండ్ల ఓట్ల లెక్కింపు మిగిలుంది.