నెల్లూరులో బాగా వెనుకబడిన విజయసాయిరెడ్డి

  • నెల్లూరు లోక్ సభ స్థానంలో వైసీపీ అభ్యర్థిగా విజయసాయి
  • 1,04,550 ఓట్లతో ముందంజలో టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
  • ఓవరాల్ గా 16 స్థానాల్లో టీడీపీ లీడింగ్
  • వైసీపీ 4, బీజేపీ 3, జనసేన 2 స్థానాల్లో ఆధిక్యం
నెల్లూరు లోక్ సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కీలక నేత విజయసాయిరెడ్డి కౌంటింగ్ లో వెనుకబడ్డారు. ఆయన ప్రత్యర్థి, టీడీపీ నేత వేమిరెడ్డి  ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతానికి 26,781 భారీ మెజారిటీతో ముందంజలో ఉన్నారు. 

ఇప్పటివరకు లెక్కింపు జరిగిన ప్రకారం... వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి 1,04,550 ఓట్లు రాగా... విజయసాయికి 77,769 ఓట్లు వచ్చాయి. మూడో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి కొప్పుల రాజు ఉన్నారు. రాజుకు 9,645 ఓట్లు వచ్చాయి. ఏపీలో లోక్ సభ స్థానాల్లో వైసీపీ సిట్టింగ్ ల్లో చాలామంది పరిస్థితి నిరాశాజనకంగా ఉంది. 

ఏపీలో మొత్తం లోక్ సభ స్థానాలు 25 కాగా, గత ఎన్నికల్లో వైసీపీ 22 ఎంపీ స్థానాలు గెలుచుకోవడం తెలిసిందే. ఈసారి కూటమి అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఇప్పటివరకు జరిగిన లెక్కింపు ప్రకారం... టీడీపీ 16, వైసీపీ 4, బీజేపీ 3, జనసేన 2 చోట్ల ముందంజలో ఉన్నాయి.


More Telugu News