ఉత్తరప్రదేశ్‌లో ఊహించని విధంగా దూసుకెళ్తున్న కాంగ్రెస్
- 80 స్థానాలకు గాను 41 స్థానాల్లో ముందంజ
- పశ్చిమ యూపీలోని 29 స్థానాల్లో ఎస్పీ-కాంగ్రెస్ కూటమిదే ఆధిక్యం
- ముస్లిం, యాదవ్, ఓబీసీ ఓట్లు కాంగ్రెస్‌కు టర్న్
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు చూస్తుంటే ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. ఊహించని విధంగా ఇక్కడ ఇండియా కూటమి అభ్యర్థులు ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 80 స్థానాలుండగా కడపటి వార్తలు అందేసరికి 41 స్థానాల్లో కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. దీనిని బట్టి యూపీలో ముస్లిం, యాదవ్, ఓబీసీ ఓట్లు కాంగ్రెస్‌కు టర్న్ అయినట్టు అర్థం చేసుకోవచ్చు.
పశ్చిమ యూపీలోని 29 స్థానాల్లో సమాజ్‌వాదీ-కాంగ్రెస్ పార్టీ కూటమి తిరుగులేని ఆధిక్యంలో కొనసాగుతోంది. 2019 ఎన్నికల్లో ఇక్కడ తిరుగులేని విజయం సాధించిన ఎన్డీయే కూటమి ఈసారి చతికిలపడేలా కనిపిస్తోంది.
పశ్చిమ యూపీలోని 29 స్థానాల్లో సమాజ్‌వాదీ-కాంగ్రెస్ పార్టీ కూటమి తిరుగులేని ఆధిక్యంలో కొనసాగుతోంది. 2019 ఎన్నికల్లో ఇక్కడ తిరుగులేని విజయం సాధించిన ఎన్డీయే కూటమి ఈసారి చతికిలపడేలా కనిపిస్తోంది.