టీ20 వరల్డ్ కప్: పసికూన ఉగాండాను 58 పరుగులకే కుప్పకూల్చిన ఆఫ్ఘన్
- గయానాలో మ్యాచ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఉగాండా
- 20 ఓవర్లలో 5 వికెట్లకు 183 పరుగులు చేసిన ఆఫ్ఘన్
- 16 ఓవర్లలో 58 పరుగులకు ఉగాండా ఆలౌట్
- 125 పరుగుల భారీ తేడాతో ఆఫ్ఘన్ విజయం
అంతర్జాతీయ క్రికెట్లో ఓనమాలు ప్రారంభించిన ఉగాండా జట్టు టీ20 వరల్డ్ కప్ లో ఓటమితో ప్రస్థానం ప్రారంభించింది. గయానాలో ఆఫ్ఘనిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో ఉగాండా 125 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ లో ఉగాండా టాస్ గెలిచి ఆఫ్ఘనిస్థాన్ కు బ్యాటింగ్ అప్పగించింది.
దాంతో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 183 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో ఉగాండా జట్టు 16 ఓవర్లలో 58 పరుగులకే కుప్పకూలింది. ఆఫ్ఘన్ లెఫ్టార్మ్ సీమర్ ఫజల్ హక్ ఫరూఖీ 5 వికెట్లతో ఉగాండా వెన్నువిరిచాడు. నవీనుల్ హక్ 2, కెప్టెన్ రషీద్ ఖాన్ 2, ముజీబ్ 1 వికెట్ తీశారు.
ఉగాండా జట్టులో రాబిన్సన్ ఒబుయా చేసిన 14 పరుగులే అత్యధిక స్కోరు. రియాజత్ అలీ షా 11 పరుగులు చేశారు. వీరిద్దరు మినహా ఆ జట్టులో మరెవ్వరూ రెండంకెల స్కోరు నమోదు చేయలేదు.