కడపలో షర్మిల వెనుకంజ

  • పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు తర్వాత లీడ్ లో అవినాశ్ రెడ్డి
  • కాంగ్రెస్ ఏపీ చీఫ్ పై 2 వేల పైచిలుకు ఓట్లతో వైసీపీ ఎంపీ అభ్యర్థి ముందంజ
  • వివేకా హత్య కేసు చుట్టూ తిరిగిన కుప్పం రాజకీయం
కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ వైఎస్ షర్మిల కడపలో వెనుకంజలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో తొలి రౌండ్ లో ముందంజలో ఉన్న షర్మిల.. రెండో రౌండ్ కు వచ్చేసరికి వెనుకబడ్డారు. షర్మిల ప్రత్యర్థి, వైసీపీ సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ముందంజలో కొనసాగుతున్నారు. రెండో రౌండ్ ముగిసేసరికి 2,274 ఓట్ల లీడ్ లో ఉన్నారు. కడప రాజకీయమంతా వైఎస్ వివేకానందారెడ్డి హత్య చుట్టే సాగింది. వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాశ్ రెడ్డికి వైసీపీ టికెట్ ఇవ్వడం సహించలేక తాను కడప నుంచి బరిలోకి దిగుతున్నట్లు షర్మిల ప్రకటించారు. వివేకా కూతురు వైఎస్ సునీత కూడా తన సోదరి షర్మిలకు మద్దతు పలికారు. కడప ఎంపీగా గెలిపించాలని ప్రజలను ఆమె అభ్యర్థించారు.


More Telugu News