ఏపీ, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ప్రారంభమైన ఓట్ల లెక్కింపు

  • నేడు కౌంటింగ్
  • లోక్ సభ, ఏపీ, ఒడిశా అసెంబ్లీ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ
  • ఈ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ 
  • మొదట పోస్టల్ బ్యాలెట్లు, 8.30 గంటల నుంచి ఈవీఎం ఓట్ల లెక్కింపు
దేశంలో అత్యంత కీలక ఘట్టం ప్రారంభమైంది. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ ఉదయం 8 గంటలకు మొదలైంది. 543 లోక్ సభ స్థానాలకు, ఏపీ, ఒడిశా అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు పూర్తి కాగా, నేడు కౌంటింగ్ చేపట్టారు. మొదట పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 8.30 నుంచి ఈవీఎం ఓట్లు లెక్కించనున్నారు. 

ఇద్దరు అభ్యర్థులకు సమానమైన ఓట్లు వస్తే డ్రా ద్వారా విజేతను నిర్ణయించనున్నారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. 

ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు, 25 లోక్ సభ స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుపుతున్నారు. తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు ఓట్ల లెక్కింపు చేపట్టారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసులను మోహరించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు.


More Telugu News