అలర్ట్... ఎన్నికల ఫలితాల కోసం ఆ లింక్స్‌పై క్లిక్ చేయవద్దు!

  • ఎన్నికల ఫలితాల పేరుతో సైబర్ దొంగలు నేరాలకు పాల్పడే అవకాశముందన్న పోలీసులు
  • సోషల్ మీడియాలో వచ్చే గుర్తు తెలియని, అనుమానిత లింక్స్‌పై క్లిక్ చేయవద్దని సూచన
  • హెచ్చరిక జారీ చేసిన అశ్వారావుపేట పోలీసులు
లోక్ సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను తెలుసుకోవాలనే ఆత్రుతలో... ప్రతి లింక్‌ను క్లిక్ చేయవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎన్నికల ఫలితాల పేరుతో సైబర్ దొంగలు సైబర్ నేరాలకు పాల్పడే అవకాశాలు ఉంటాయని సూచిస్తున్నారు. ఎన్నికల్లో అభ్యర్థి లేదా పార్టీ గెలిచిందంటూ సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వెబ్ సైట్ లింక్‌పై క్లిక్ చేయవద్దని... అలా చేస్తే సైబర్ మోసానికి గురయ్యే అవకాశముందని చెబుతున్నారు.

గుర్తు తెలియని లేదా అనుమానిత లింక్స్‌పై క్లిక్ చేస్తే సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఖాతా సహా మనకు సంబంధించిన ఇతర వివరాలు దొంగిలించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. బ్యాంకులోని డబ్బును గుల్ల చేసే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. గుర్తు తెలియని వెబ్ లింక్స్‌పై క్లిక్ చేయవద్దంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పోలీసులు అలర్ట్ చేశారు.


More Telugu News