టీ20 వరల్డ్ కప్: శ్రీలంక 77 పరుగులకే ఢమాల్
- న్యూయార్క్ లో శ్రీలంక × దక్షిణాఫ్రికా
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక
- 19.1 ఓవర్లలోనే ఆలౌట్
- 4 వికెట్లతో లంకను బెంబేలెత్తించిన నోర్కియా
ఇటీవల కాలంలో కొన్ని దారుణమైన బ్యాటింగ్ ప్రదర్శనలు కనబర్చిన శ్రీలంక జట్టు... మరోసారి వైఫల్యం పాలైంది. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఇవాళ దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 77 పరుగులకే కుప్పకూలింది. సఫారీ పేసర్ ఆన్రిచ్ నోర్కియా ధాటికి 19.1 ఓవర్లకే చేతులెత్తేసింది.
శ్రీలంక జట్టులో ఓపెనర్ కుశాల్ మెండిస్ 19, ఏంజెలో మాథ్యూస్ 16 పరుగులు చేశారు. లంక జట్టులో కెప్టెన్ వనిందు హసరంగ సహా నలుగురు బ్యాట్స్ మన్లు డకౌట్ అయ్యారు. న్యూయార్క్ స్టేడియంలోని డ్రాప్ ఇన్ పిచ్ పై బ్యాటింగ్ చేసేందుకు శ్రీలంక ఆద్యంతం తడబాటుకు గురైంది.
పిచ్ పై స్వింగ్, టర్న్ ను చక్కగా ఉపయోగించుకున్న దక్షిణాఫ్రికా బౌలర్లు... లంక జట్టును 100 పరుగుల లోపే చుట్టేశారు. సఫారీ బౌలర్లలో పేసర్ ఆన్రిచ్ నోర్కియా 4, లెఫ్టార్మ్ స్పిన్నర్ కేశవ్ మహరాజ్ 2, కగిసో రబాడా 2, ఓట్నీల్ బార్ట్ మాన్ 1 వికెట్ తీశారు.