తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం

  • 17 లోక్ సభ నియోజకవర్గాల్లో బరిలో 525 మంది అభ్యర్థులు
  • 120 హాళ్లలో 1855 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు
  • పోస్టల్  బ్యాలెట్ ఓట్ల లెక్కింపు తర్వాత ఈవీఎంల లెక్కింపు
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అంతా సిద్ధమైంది. రేపు ఉదయ 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. తెలంగాణలో 17 లోక్ సభ నియోజకవర్గాలు ఉండగా, 525 మంది బరిలో నిలిచారు. 2.20 కోట్లకు పైగా ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు. 120 హాళ్లలో 1855 టేబుళ్లపై ఓట్లను లెక్కిస్తారు. 2.18 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లను 19 హాళ్లలో 276 టేబుళ్లపై లెక్కిస్తారు.

సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశముంది. ఓట్ల లెక్కింపుకు 10వేల మంది సిబ్బందిని నియమించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను, సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. రేపు మొత్తం మద్యం దుకాణాలు బంద్ ఉండనున్నాయి.

అత్యధికంగా చొప్పదండి, దేవరకొండ, యాకుత్‌పురా అసెంబ్లీ సెగ్మెంట్లలో 21 రౌండ్లలో, అత్యల్పంగా ఆర్మూరు, భద్రాచలం, అశ్వారావుపేట సెగ్మెంట్లలో 13 రౌండ్లలో లెక్కిస్తారు. మొదట పోస్టల్ బ్యాలెట్లను, ఆ తర్వాత ఈవీఎం ఓట్లను లెక్కిస్తారు. గెలిచిన అభ్యర్థుల ర్యాలీలను నిషేధించారు.


More Telugu News