కౌంటింగ్ రోజున ఏపీకి వర్ష సూచన
- ఏపీలో రేపు ఓట్ల లెక్కింపు
- అనేక జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు
- పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
- అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం
- ఏపీఎస్డీఎంఏ వెల్లడి
ఏపీలో రేపు అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుండగా, పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) వెల్లడించింది.
జూన్ 4న అన్నమయ్య, విజయనగరం, తిరుపతి, శ్రీకాకుళం, వైఎస్సార్ కడప, చిత్తూరు, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీఎస్డీఎంఏ హెచ్చరించింది.
అదే సమయంలో... ఎన్టీఆర్, వైఎస్సార్ కడప, శ్రీ సత్యసాయి, ఏలూరు, నెల్లూరు, అనంతపురం, బాపట్ల, కృష్ణా, నంద్యాల, ఎన్టీఆర్, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వివరించింది.