ఎయిర్‌టెల్ నుంచి రూ.1000లోపు నాలుగు కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు

  • రూ.499, రూ.699, రూ.799, రూ.899 ప్లాన్ల కింద నెలకు 3072 జీబీల డేటా
  • ప్లాన్‌ను బట్టి డేటా స్పీడ్, అదనపు ప్రయోజనాలు ఆఫర్ చేస్తున్న ‘ఎయిర్‌టెల్ ఎక్స్‌‌స్ట్రీమ్’
  • దేశవ్యాప్తంగా ఫైబర్ నెట్‌వర్క్ విస్తరణే లక్ష్యంగా యూజర్లను ఆకర్షిస్తున్న ఎయిర్‌టెల్
దేశవ్యాప్తంగా మరిన్ని నగరాలకు విస్తరించాలని యోచిస్తున్న భారతి ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ సేవల విభాగం ‘ఎక్స్‌స్ట్రీమ్’ సరసమైన ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. రూ.1000 లోపు చౌకైన నాలుగు ప్లాన్లను అందిస్తోంది. రూ. 499 ప్లాన్ కింద 40 ఎంబీపీఎస్ స్పీడ్‌తో నెలకు 3.3టీబీ (3072జీబీ) డేటాను అందిస్తోంది. అదనపు ప్రయోజనాల కింద వింగ్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందవచ్చు. ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఫోన్లు వాడే యూజర్లు ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌లో అర్హత కలిగిన బెనిఫిట్స్‌ను పొందవచ్చు.

ఇక రూ.699 ప్లాన్ కింద 40 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 3.3టీబీల (3072జీబీ) నెలవారీ డేటాను ఆఫర్ చేస్తోంది. అదనపు ప్రయోజనాల కింద 350కిపైగా ఛానెల్స్, ఓటీటీ బెనిఫిట్స్ కింద టీవీ కనెక్షన్లను కూడా అందిస్తోంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ జాబితాలో డిస్నీ+ హాట్‌స్టార్ కూడా ఉంది.

అదనపు వినోదంతో రూ.799, రూ.899 ప్లాన్లు..
రూ.799 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ కింద 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో నెలకు 3.3టీబీల (3072 జీబీ) డేటాను అందిస్తోంది. వింక్ మ్యూజిక్, ‘ఎక్స్‌స్ట్రీమ్ ప్లే’ సబ్‌స్క్రిప్షన్‌లు ఉచితంగా లభించనున్నాయి. ఇక రూ.899 ప్లాన్ కింద ఎంబీపీఎస్ స్పీడ్‌తో నెలకు 3.3టీబీల (3072జీబీ) నెలవారీ డేటా అందిస్తోంది. ఈ ప్లాన్‌లో అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్‌తో పాటు 350కి టీవీ ఛానెల్స్ అందించే సెట్-టాప్ బాక్స్, ఓటీటీ బెనిఫిట్స్ అదనపు ప్రయోజనాలుగా లభించనున్నాయి. కాగా ఈ ప్లాన్ల కింద యూజర్లు ఉచిత ఫిక్స్‌డ్-లైన్ వాయిస్ కాలింగ్ కనెక్షన్‌ను పొందవచ్చు. అయితే వారికి ల్యాండ్‌లైన్ కనెక్షన్ అవసరం అవుతుంది.

కాగా మరిన్ని నగరాలకు విస్తరించడమే లక్ష్యంగా మౌలిక సదుపాయాల్లో ఎయిర్‌టెల్ భారీ పెట్టుబడులు పెడుతోంది. ఆయా ప్రాంతాల్లో స్థానిక కేబుల్ ఆపరేటర్లతో భాగస్వామ్యం కుదుర్చుకోవాలని యోచిస్తోంది.


More Telugu News