బెంగళూరు రేవ్ పార్టీలో కీలక పాత్ర... సినీ నటి హేమ అరెస్ట్
- గత నెల 20న బెంగళూరులో రేవ్ పార్టీ
- విచారణకు హాజరు కావాలని మూడుసార్లు సీసీబీ నోటీసులు
- మూడోసారి నోటీసుతో ఈరోజు విచారణకు హాజరైన హేమ
- విచారణ అనంతరం అదుపులోకి తీసుకున్న పోలీసులు
సినీ నటి హేమను సీసీబీ పోలీసులు సోమవారం బెంగళూరులో అరెస్ట్ చేశారు. అరెస్ట్ అనంతరం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. రేపు ఆమెను కోర్టులో హాజరుపరచనున్నారు. బెంగళూరులో గత నెల 20న జరిగిన రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నారు. ఆమె రక్త నమూనాలో డ్రగ్స్ పాజిటివ్‌ను గుర్తించారు. దీంతో విచారణకు రావాలని ఆమెకు సీసీబీ పోలీసులు మూడుసార్లు నోటీసులు ఇచ్చారు. రెండుసార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆమె హాజరుకాలేదు. మూడోసారి నోటీసుతో విచారణకు హాజరయ్యారు.
ఉదయం నుంచి ఆమెను సీసీబీ పోలీసులు విచారించారు. అనంతరం ఆమెను అరెస్ట్ చేశారు. రేవ్ పార్టీ నిర్వహణలో ఆమె కీలక పాత్ర వహించినట్లుగా పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది.
మీడియా కంటపడకుండా బుర్ఖాలో వచ్చిన హేమ
హేమ మీడియా కంటపడకుండా ఉండేందుకు బుర్ఖాలో వచ్చారు. ఆమెకు ఆ బుర్ఖాలోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. హేమతో పాటు మరొకరిని సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్ సప్లయర్ ఇమ్రాన్ షరీఫ్‌ను అరెస్ట్ చేశారు. బెంగళూరు రేవ్ పార్టీకి ఇమ్రాన్ డ్రగ్స్ సరఫరా చేశారు.