గోల్కొండ బోనాల జాతర తేదీలు వచ్చేశాయ్!
- జులై 7వ తారీఖు నుంచి బోనాలు ప్రారంభం
- లాల్ దర్వాజ సహా అన్ని ఆలయాల్లో జులై 19న బోనాల జాతర ఉత్సవాలు
- జులై 28న బోనాల సమర్పణ.. 29న జాతర, సామూహిక ఘటాల ఊరేగింపు
భాగ్యనగరంలో బోనాల పండుగను నగర ప్రజలు ఎంత ఘనంగా జరుపుకుంటారో తెలిసిందే. ఆషాడ మాసంలో నగరవ్యాప్తంగా గోల్కొండ బోనాలు వైభవంగా జరుగుతాయి. ఈ నేపథ్యంలో భాగ్యనగర్ శ్రీ మహంకాళి బోనాల జాతర ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ తాజాగా భేటీ అయ్యింది.
ఈ సమావేశంలో ఈ ఏడాది బోనాల పండుగ నిర్వహణ, తేదీలపై చర్చించారు. అనంతరం జులై 7వ తారీఖు నుంచి బోనాలు ప్రారంభం అవుతాయని ప్రకటించారు. అలాగే పాతబస్తీలోని లాల్ దర్వాజ సహా అన్ని ఆలయాల్లో జులై 19న బోనాల జాతర ఉత్సవాలు ప్రారంభం అవుతాయని, జులై 28న బోనాలు సమర్పించాలని తెలిపారు. ఇక జులై 29న జాతర, సామూహిక ఘటాల ఊరేగింపు ఉంటుందన్నారు. భాగ్యనగర్ శ్రీ మహంకాళి బోనాల జాతర ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ సభ్యులు చెప్పారు.