ఇజ్రాయెల్ పౌరులపై నిషేధం విధించనున్న మాల్దీవులు

  • గాజాపై దాడుల కారణంగా ఇజ్రాయెలీలపై నిషేధానికి మాల్దీవుల పౌరుల డిమాండ్
  • ప్రజల డిమాండ్ ను అనుసరించి నిషేధం విధించేందుకు మాల్దీవుల ప్రభుత్వం నిర్ణయం
  • ఈ మేరకు చట్టంలో మార్పులు చేయనున్నట్టు దేశ అంతర్గత భద్రతా వ్యవహారాల మంత్రి ప్రకటన
  • నిషేధం ప్రక్రియ వేగవంతం చేసేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు
ఇజ్రాయెల్ పౌరులు తమ దేశంలో కాలుపెట్టకుండా నిషేధం విధించేందుకు మాల్దీవుల ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు చట్టంలో మార్పులు చేసేందుకు కేబినెట్ నిర్ణయించింది. గాజాపై దాడులపై నేపథ్యంలో ఇజ్రాయెల్ పౌరులపై నిషేధం విధించాలన్న స్థానికుల పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని హోమ్‌లాండ్ సెక్యూరిటీ, టెక్నాలజీ శాఖ మంత్రి అలీ ఇసుహాన్ మీడియాకు తెలిపారు. నిషేధం విధింపు వేగవంతం చేసేందుకు ప్రత్యేక కమిటీ కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మాల్దీవులను ఏటా 10 లక్షల మంది పర్యాటకులు సందర్శిస్తుండగా వారిలో 15 వేల మంది ఇజ్రాయెలీ పౌరులు ఉన్నారని స్థానిక మీడియా చెబుతోంది.


More Telugu News