2,500 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైన టాటా స్టీల్!
- యూకేలోని టాటా స్టీల్ సంచలన నిర్ణయం
- స్టీల్ ఉత్పత్తిలో పర్యావరణ హిత విధానాల వైపు మళ్లుతున్న టాటా స్టీల్
- ఈ నేపథ్యంలో ఉద్యోగుల తొలగింపులు తప్పదన్న సంస్థ సీఈఓ
- కంపెనీ నిర్ణయంపై కార్మిక సంఘాలు ఆగ్రహం
టాటా స్టీల్ లో 2500 మంది ఉద్యోగులను తొలగించేందుకు సంస్థ సిద్ధమైంది. యూకే కార్యకలాపాలతో ముడిపడిన వారిని తొలగించబోతున్నట్టు పేర్కొంది. స్టీల్ తయారీ విధానంలో పర్యావరణ హిత మార్పులు చేస్తున్న నేపథ్యంలో ఉద్యోగుల తొలగింపు తప్పదని స్పష్టం చేసింది. మరోవైపు, కంపెనీ నిర్ణయాన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
టాటా స్టీల్ బ్రిటన్ లో అతిపెద్ద స్టీల్ తయారీ సంస్థగా ఉంది. కంపెనీలో 8 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. స్టీల్ తయారీలో కర్బన ఉద్గారాల తగ్గింపు కోసం కంపెనీ తన కోక్ ఒవెన్, బ్లాస్ట్ ఫర్నేస్‌లను మూసివేసేందుకు నిర్ణయించింది. వీటి స్థానంలో పర్యావరణ హిత ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్ ప్రవేశపెట్టనుంది. వీటి వినియోగంతో ఉత్పాదకత పెరగడంతో పాటు కర్బన ఉద్గారాల విడుదల కూడా తగ్గుతాయని కంపెనీ సీఈఓ నరేంద్రన్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కోతలు తప్పవని స్పష్టం చేశారు.
యూకేలో స్టీల్ స్క్రాప్ అత్యధికంగా ఉత్పత్తి అవుతోందని కూడా కంపెనీ పేర్కొంది. ఈ స్క్రాప్ నుంచి స్టీల్ ను ఉత్పత్తి చేసి, యూకే వినియోగదారులకు అందించాలనే యోచనలో ఉన్నట్టు పేర్కొంది. దీంతో, ఇమును, బొగ్గు దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని కూడా పేర్కొంది.