టీడీపీకి సొంతంగానే మ్యాజిక్ ఫిగర్... ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ లో ఆసక్తికర అంశాలు

  • ఏపీలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 175
  • ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్... 88
  • టీడీపీకి సొంతంగా 78 నుంచి 96 స్థానాలు వస్తాయన్న ఇండియా టుడే
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే-మై యాక్సిస్ ఎగ్జిట్ పోల్ లో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి 98 నుంచి 120 స్థానాల వరకు గెలుచుకుంటుందని ఇండియా టుడే-మై యాక్సిస్ ఎగ్జిట్ పోల్ పేర్కొంది. 

టీడీపీకి సొంతంగా 78 నుంచి 96 అసెంబ్లీ స్థానాలు వస్తాయని వెల్లడించింది. ఏపీలో మొత్తం అసెంబ్లీ సీట్లు 175 కాగా... ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్.. 88 స్థానాలు. ఆ లెక్కన మిత్రపక్షాలతో పనిలేకుండానే టీడీపీ మ్యాజిక్ ఫిగర్ ను అందుకుంటుందని వివరించింది. 

ఇక, టీడీపీ భాగస్వామ్య పక్షాలైన జనసేన 16 నుంచి 18 అసెంబ్లీ స్థానాలు, బీజేపీ 4 నుంచి 6 స్థానాల వరకు గెలుచుకునే అవకాశముందని వివరించింది. అదే సమయంలో అధికార వైసీపీ 55 నుంచి 77 స్థానాలు గెలుచుకుంటుందని అంచనా వేసింది. రాష్ట్రంలో దాదాపు అంతరించిపోయిన కాంగ్రెస్ పార్టీ 0-2 స్థానాల్లో ఉనికిని చాటుకునే అవకాశముందని ఇండియా టుడే- మై యాక్సిస్ వెల్లడించింది. 

ఇక లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ 13 నుంచి 15 స్థానాలు, బీజేపీ 4 నుంచి 6 స్థానాలు, వైసీపీ 2 నుంచి 4 స్థానాలు, జనసేన 2 స్థానాలు గెలిచే అవకాశమున్నట్టు వివరించింది.


More Telugu News