కింద మంటపెట్టినట్టే.. ఢిల్లీలో వాటర్ ట్యాంకులో సలసలా మరుగుతున్న నీళ్లు.. వీడియో ఇదిగో!

  • గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి ఉష్ణోగ్రతలు
  • దేశవ్యాప్తంగా ఎంతోమంది ప్రాణాలు తీసిన వడగాలులు
  • వీడియోపై నెటిజన్ల మిశ్రమ స్పందన 
  • నిజం కాదని కొట్టేస్తున్న వారే ఎక్కువ
గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి ఎండలు మండిపోతున్నాయి. దేశవ్యాప్తంగా భానుడు చెలరేగిపోయాడు. ఫలితంగా కనీవినీ ఎరుగని రీతిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో అయితే సూరీడి భగభగలకు జనం తల్లడిల్లిపోయారు. సాయంత్రమైనా సరే కాలు బయటపెట్టేందుకు భయపడ్డారు. రెండ్రోజుల క్రితం దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత ఇక్కడ నమోదైంది. వడగాలులకు దేశవ్యాప్తంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలో ఎండ వేడికి అద్దంపట్టే వీడియో ఒకటి తాజాగా వైరల్ అవుతోంది.

ఓ భవనంపైన ఉన్న నీళ్ల ట్యాంకులోని నీళ్లు కింద మంటపెట్టినట్టుగా కుతకుత ఉడికిపోయాయి. ఉష్ణోగ్రత 52 డిగ్రీలకు చేరుకోవడంతో ట్యాంకులోని నీళ్లు ఇలా మరిగిపోతున్నాయంటూ ఓ నెటిజన్ ఈ వీడియోను పంచుకున్నాడు. ఈ వీడియో విషయంలో నెటిజన్లు రెండుగా విడిపోయారు. 

ఒకరు అమ్మో.. ఈ వేడికి ఢిల్లీ జనం ఎలా బతుకుతున్నారో అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తే మరికొందరు మాత్రం ఈ వీడియో ఫేక్ అని కొట్టిపడేస్తున్నారు. నీళ్ల బాయిలింగ్ పాయింట్ 100 డిగ్రీలని, 52 డిగ్రీల వద్ద నీళ్లు మరగడం అసాధ్యమని కొట్టిపడేస్తున్నారు. అంతేకాదు, ఢిల్లీలో 52 డిగ్రీల ఉష్ణోగ్రత అసలు నమోదు కాలేదని మరికొందరు చెప్తున్నారు.


More Telugu News