పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నుంచి నాకు ప్రాణహాని: సుప్రీంకోర్టుకు పాల్వాయిగేటు ఘటన బాధితుడు
- పిన్నెల్లికి హైకోర్టు ఇచ్చిన అరెస్ట్ మినహాయింపు ఆదేశాలను రద్దు చేయాలని పిటిషన్
- ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో తనపై కూడా దాడి చేసినట్లు వెల్లడి
- ఈ నేపథ్యంలో కౌంటింగ్ రోజు కూడా హింసకు పాల్పడే ప్రమాదం ఉందని పిటిషన్
వైసీపీ నేత, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ... పాల్వాయిగేటు ఘటన బాధితుడు, టీడీపీ పోలింగ్ ఏజెంట్ శేషగిరిరావు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. పిన్నెల్లికి హైకోర్టు ఇచ్చిన అరెస్ట్ మినహాయింపు ఆదేశాలను రద్దు చేయాలని ఆ పిటిషన్‌లో కోరాడు. ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో తనపై దాడి చేసినట్లు తెలిపాడు. ఈ నేపథ్యంలో కౌంటింగ్ రోజు కూడా హింసకు పాల్పడే ప్రమాదం ఉందన్నాడు.
ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనపై శేషగిరిరావు మరో పిటిషన్ కూడా దాఖలు చేశాడు. ఆధారాలు ఉన్నప్పటికీ ఎమ్మెల్యే పేరు, అనుచరుల పేర్లు లేకుండా కేసు పెట్టినట్లు పేర్కొన్నాడు. గుర్తు తెలియని వ్యక్తులంటూ ఎమ్మెల్యేకు అనుకూలంగా వ్యవహరించారన్నాడు. ఈ అంశాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేసినట్లు తెలిపాడు. అంత తీవ్ర ఘటనలు జరిగినప్పటికీ బెయిల్ రావడం ఆందోళన కలిగిస్తోందన్నాడు. ఈ రెండు పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది.