వెంకటేశ్ కాళీమాతను ఎక్కువగా పూజిస్తారట!
- 75 సినిమాలు పూర్తిచేసిన వెంకటేశ్
- ఆయన ఫోన్స్ ఎక్కువగా వాడరన్న రాఘవ
- ఆధ్యాత్మిక భావాలు ఎక్కువని వెల్లడి
- రమణ మహర్షి బుక్స్ చదువుతారని వివరణ
వెంకటేశ్ .. సుదీర్ఘమైన తన కెరియర్ లో ఆయన 75 సినిమాలు పూర్తి చేశారు. వివాదాలకు దూరంగా .. విజయాలకు దగ్గరగా ఉండే వెంకటేశ్ ను చాలామంది అభిమానిస్తూ ఉంటారు. వెంకటేశ్ గురించి బయటివారికి తెలిసింది చాలా తక్కువ. అందువలన ఆయన విషయాలను తెలుసుకోవడానికి అంతా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు.
అలాంటి వెంకటేశ్ గురించి ఆయన మేకప్ మెన్ రాఘవ మాట్లాడుతూ .. "శత్రువు సినిమా వచ్చిన ఆ సమయంలో వెంకటేశ్ గారు చాలా ఎగ్రెసివ్ గా ఉండేవారు. కానీ ఆ తరువాత ఏదో మిరాకిల్ జరిగినట్టుగా ఆయనలో ఒక అద్భుతమైన మార్పు రావడం నేను గమనించాను. సందర్భానికి తగినట్టుగా మాట్లాడటం .. ఇతర విషయాలలో జోక్యం చేసుకోకపోవడం బాగుందనిపించింది" అని అన్నారు.
"వెంకటేశ్ గారు పెద్దగా టెన్షన్స్ పెట్టుకోరు. ఫోన్లు కూడా ఎక్కువగా ఉపయోగించరు. ఆయనకి సిగరెట్ గానీ .. ముందుగాని అలవాటు లేదు. వచ్చామా .. షూటింగు అయిందా .. ఇంటికి వెళ్లిపోయామా అన్నట్టుగానే ఉంటారు. మొదటి నుంచి కూడా అంతే. ఆయన కాళీమాత భక్తుడు. రమణ మహర్షి గురించిన పుస్తకాలను ఆయన ఎక్కువగా చదువుతారు" అని చెప్పారు.