కౌంటింగ్ కేంద్రంలోకి సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించం: తెలంగాణ సీఈవో వికాస్ రాజ్
- కౌంటింగ్ కేంద్రం వద్ద నాలుగంచెల భద్రత ఉంటుందని వెల్లడి
- ప్రతి మూలను కవర్ చేసేలా సీసీ కెమెరాలు ఉంటాయన్న సీఈవో
- సెగ్మెంట్ల వారీగా ఓట్ల లెక్కింపు సిబ్బందిని ర్యాండమ్‌గా కేటాయిస్తామన్న సీఈవో
ఈ నెల 4న లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో... కౌంటింగ్ కేంద్రంలో ఏజెంట్ల వద్ద, సిబ్బంది వద్ద సెల్ ఫోన్లు ఉండవని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. కౌంటింగ్ కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించబోమన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద నాలుగంచెల భద్రత ఉంటుందని తెలిపారు. మరో మూడు రోజుల్లో ఓట్ల లెక్కింపు ఉన్నందున సీఈవో వికాస్ రాజ్ మీడియా సమావేశం నిర్వహించారు.
కౌంటింగ్ కేంద్రంలో ప్రతి మూలను కవర్ చేసేలా సీసీ కెమెరాలు ఉంటాయన్నారు. ఓట్ల లెక్కింపులో దాదాపు 10వేల మంది సిబ్బంది పాల్గొంటారని వెల్లడించారు. సెగ్మెంట్ల వారీగా ఓట్ల లెక్కింపు సిబ్బందిని ర్యాండమ్‌గా కేటాయిస్తామన్నారు. లెక్కింపు రోజున ఉదయం ఐదు గంటలకు మరోసారి ర్యాండమ్‌గా సిబ్బందిని కేటాయిస్తామన్నారు. స్ట్రాంగ్ రూం నుంచి లెక్కింపు కేంద్రం వరకు పటిష్ఠ భద్రత ఉంటుందన్నారు.