రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీ బండి సంజయ్ లేఖ

  • ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సీబీఐ విచారణ కోరిన బండి సంజయ్
  • తెలంగాణలోకి సీబీఐని నిషేధిస్తూ గత ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో రద్దు చేయాలన్న బండి సంజయ్
  • ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కేసీఆర్, కేటీఆర్ నడిపించారని ఆరోపణ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కరీంనగర్ ఎంపీ, బీజేపీ నేత బండి సంజయ్ శనివారం బహిరంగ లేఖ రాశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సీబీఐ విచారణ కోరాలని అందులో పేర్కొన్నారు. తెలంగాణలోకి సీబీఐని నిషేధిస్తూ గత ప్రభుత్వం జీవో తీసుకు వచ్చిందని... దీనిని రద్దు చేయాలని ఆయన కోరారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కేసీఆర్, కేటీఆర్ నడిపించారని ఆరోపించారు. ఈ కేసులో వారికి నోటీసులు ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తోందని వ్యాఖ్యానించారు.


More Telugu News