పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది.. జూన్, జులైలలో సుముహూర్తాలు
- ఈ నెలాఖరులో మొదలువుతున్న శుభ ఘడియలు
- వచ్చే నెల ప్రారంభంలో మంచి రోజులు
- మూఢం, శూన్య మాసం కారణంగా నిలిచిన వివాహాలు
మూఢం, శూన్య మాసం కారణంగా కొన్ని రోజులుగా శుభకార్యాల సందడి ఎక్కడా కనిపించడంలేదు.. అయితే, ఈ నెలాఖరున మంచి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. వచ్చే నెల ప్రారంభంలోనూ పెళ్లి ముహూర్తాలు ఉన్నాయని తెలిపారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సందడి మొదలుకానుంది. ఆహ్వాన పత్రికలు, బాజాభజంత్రీల చప్పుళ్లు హోరెత్తిపోనున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 11 నుంచి ఏప్రిల్ 26 వరకు వివాహాలతో పాటు పలు శుభకార్యాలు జరిగాయి. ఆ తర్వాత మూఢం రావడంతో చాలామంది శుభకార్యాలను వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు మంచి రోజులు రావడంతో వివాహాలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
పండితులు చెప్పిన వివరాల ప్రకారం ఈ నెలాఖరు నుంచి శుభ ఘడియలు మొదలు కానున్నాయి. మాఘ, ఉత్తర ఫాల్గుణి, హస్తా, స్వాతి నక్షత్రాల వేళ శుభ ముహుర్తాలు ఉన్నాయని, వివాహాది శుభకార్యాలకు మంచి ముహూర్తాలని పండితులు చెప్పారు. ఈ ముహూర్తాలు దాటితే చాతుర్మాసం కారణంగా ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు మంచి ముహూర్తాలు లేవని వివరించారు. ఆ తర్వాత మళ్లీ డిసెంబర్ నెలలోనే శుభకార్యాలకు ముహూర్తాలు ఉన్నాయని పేర్కొన్నారు.
శుభ ముహూర్తాలు ఇవే..
జూన్ 29 శనివారం, జులై 9 మంగళవారం, జులై 11 గురువారం, జులై 12 శుక్రవారం, జులై 13 శనివారం, జులై 14 ఆదివారం, జులై 15 సోమవారం