భారత్ జీడీపీ వృద్ధి 8.2 శాతం.. ఇది ట్రైలర్ మాత్రమే అన్న ప్రధాని మోదీ!
- 2023–24 ఆర్థిక సంవత్సరానికి భారత్ జీడీపీ వృద్ధి 8.2 శాతం
- గత ఆర్ధిక సంవత్సరంలో భారత్ జీడీపీ వృద్ధి 7 శాతం
- ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థకు సూచనగా పేర్కొన్న ప్రధాని
దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కీలకమైన జీడీపీ గణాంకాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. 2023–24 ఆర్థిక సంవత్సరానికి భారత్ జీడీపీ వృద్ధి 8.2 శాతానికి చేరుకుందని ప్రకటించారు. ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థకు సూచనగా ఆయన పేర్కొన్నారు. వృద్ధి రేటు మునుపటి అంచనాలను మించిపోయిందన్నారు. అంతకు క్రితం ఆర్ధిక సంవత్సరంలో భారత్ జీడీపీ 7 శాతం వృద్ధితో పోలిస్తే మెరుగైన వృద్ధి సాధించినట్లు తెలిపారు.
ఇది ట్రైలర్ మాత్రమేనంటూ ప్రధాని మోదీ ప్రశంసలు
భారత జీడీపీ వృద్ధిపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. '2023-24 క్యూ4 జీడీపీ వృద్ధి డేటా మన ఆర్థిక వ్యవస్థలో బలమైన ఊపును చూపుతోంది. ఇది మరింత వేగవంతం కావడానికి సిద్ధంగా ఉంది. మన దేశంలోని కష్టపడి పనిచేసే ప్రజలకు ధన్యవాదాలు. 2023-24 సంవత్సరానికి 8.2 శాతం వృద్ధి అనేది ప్రపంచవ్యాప్తంగా భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది. ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే, ఇది రాబోయే విషయాల ట్రైలర్ మాత్రమే' అంటూ ప్రధాని ట్వీట్ చేశారు.
త్రైమాసిక, వార్షిక వృద్ధి ఇలా..
2023–24 నాలుగో త్రైమాసికంలో భారతదేశ వాస్తవ జీడీపీ 7.8 శాతం వృద్ధి రేటును ప్రతిబింబిస్తూ రూ. 47.24 లక్షల కోట్లకు పెరిగింది. గత త్రైమాసికంలో (జనవరి-మార్చి) జీడీపీ 7.8 శాతంతో స్వల్పంగా మందగించినప్పటికీ, వివిధ రంగాల్లో బలమైన వృద్ధితో ఆర్థిక వ్యవస్థ స్థిరంగా మంచి పనితీరు కనబరిచింది. ఈ గణనీయమైన వృద్ధి భారత ఆర్థిక వ్యవస్థను 3.5 ట్రిలియన్ డాలర్లకు పెంచింది. రాబోయే సంవత్సరాల్లో 5 ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని సాధించడానికి వేదికను ఏర్పాటు చేసింది.
వివిధ రంగాల వారీగా గణాంకాలు..
తయారీ రంగం ప్రోత్సాహకర వృద్ధి నమోదు చేయడంతో మెరుగైన జీడీపీ గణాంకాలు సాధ్యమయ్యాయి. 2023-24లో తయారీ రంగం ఏకంగా 8.9 శాతం వృద్ధి చెందింది. ఇక చివరి క్వార్టర్‌లోనూ భారత జీడీపీ 7.8 శాతంతో సత్తా చాటింది. అయితే వ్యవసాయ రంగం వృద్ధి 0.6 శాతానికి క్షీణించింది. సేవల రంగ వృద్ధి మిశ్రమంగా ఉంది. అటు ఆర్థిక, రియల్ ఎస్టేట్ సేవలు 7.6 శాతం వృద్ధిని సాధించాయి. అలాగే వాణిజ్యం, ఆతిథ్యం 5.1 శాతం పెరిగింది.