జగన్ చిత్తుగా ఓడిపోతున్నారు: సీపీఐ నారాయణ
- ఈ ఐదేళ్లలో వైసీపీ నాయకులు చేయని పాపాలు లేవన్న నారాయణ
- ఓటమి తెలిసీ విశాఖలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు అంటున్నారని ఎద్దేవా
- కన్యాకుమారిలో ధ్యానం చేసి మోదీ ఆ ప్రాంతాన్ని కలుషితం చేశారని విమర్శ
ఈసారి జగన్‌మోహన్‌రెడ్డి దారుణంగా ఓడిపోతున్నారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ జోస్యం చెప్పారు. గత ఐదేళ్లలో వైసీపీ నాయకులు చేయని పాపాలంటూ లేవని, కాబట్టి ప్రజలందరూ కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారని తెలిపారు. నిన్న తిరుపతిలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
జగన్ ఓడిపోతున్నారని తెలిసి కూడా వైజాగ్‌లో ప్రమాణ స్వీకారం ఉంటుందని ఏర్పాట్లు చేస్తుండడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై రాజకీయంగా కక్ష పెంచుకున్న జగన్ ఆయనను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏబీవీకి విధులు కేటాయించాలని సీఎస్ జవహర్‌రెడ్డికి తాను లేఖ రాశానని, పదవీ విరమణ రోజు ఆయనకు పోస్టింగ్ ఇవ్వడం సంతోషాన్నిచ్చిందని తెలిపారు. చేసిన పాపాలను కడుక్కునేందుకే ప్రధాని మోదీ కన్యాకుమారి వెళ్లారని, అక్కడ ధ్యానం చేయడం అంటే.. ఆ ప్రాంతాన్ని కలుషితం చేయడమేనని నారాయణ విమర్శించారు.