కేసీఆర్‌పై దుష్ప్రచారం... 16 న్యూస్ ఛానల్స్‌పై బాల్క సుమన్ ఫిర్యాదు
- నిరాధారమైన వార్తలను ప్రచారం చేస్తూ కేసీఆర్ ఇమేజ్‌ను దెబ్బతీసే ప్రయత్నాలు చేశారని ఆరోపణ
- ఆధారాలు లేని కథనాలు ఇచ్చే మీడియాను కట్టడి చేయాలని పోలీసులను కోరినట్లు వెల్లడి
- ఇకనైనా మీడియా నిర్ధారణ చేసుకొని కథనాలు ప్రసారం చేయాలని సూచన
మాజీ సీఎం, తమ పార్టీ అధినేత కేసీఆర్‌పై దుష్ప్రచారం చేస్తున్నారంటూ 16 న్యూస్ ఛానల్స్‌పై బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ శుక్రవారం హైదరాబాద్, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... పదహారు న్యూస్ ఛానల్స్ నిరాధారమైన వార్తలను ప్రచారం చేస్తూ తమ పార్టీ అధినేత కేసీఆర్ ఇమేజ్‌ను దెబ్బతీసే ప్రయత్నాలు చేశాయని ఆరోపించారు. ఆధారాలు లేని కథనాలు ఇచ్చే మీడియాను కట్టడి చేయాలని పోలీసులను కోరినట్లు చెప్పారు.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, వీ6, ఎన్టీవీ, ఐన్యూస్, అమ్మా, బీఆర్కే, జర్నలిస్ట్ సాయి, మైక్ టీవీ, నేషనలిస్ట్ హబ్, ప్రైమ్ న్యూస్, ఆర్టీవీ, రాజ్ న్యూస్, రెడ్ టీవీ.. ఇలా పదహారు న్యూస్ ఛానల్స్‌పై ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఇటీవల లిక్కర్ కేసుకు సంబంధించిన వార్తలు ప్రచారం చేస్తూ కేసీఆర్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేలా పలు ఛానల్స్ కథనాలను ప్రసారం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా ఎలాంటి నిర్ధారణ లేకుండా గొప్ప నాయకుడిపై అసత్యాలతో కూడిన వార్త కథనాలను ప్రచారం చేయడం సరికాదన్నారు. ఇకనైనా మీడియా నిర్ధారణ చేసుకొని కథనాలు ప్రసారం చేయాలని సూచించారు.