ఐదు రోజుల నష్టాలకు బ్రేక్... స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • వరుసగా ఐదు రోజులు నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
  • నేడు స్వల్ప లాభాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ
  • ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆచితూచి లావాదేవీలు
భారత స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 75.71 పాయింట్ల లాభంతో 73,961.31 వద్ద ముగియగా... నిఫ్టీ 42.00 పాయింట్ల వృద్ధితో 22,530.70 వద్ద ముగిసింది. వరుసగా గత ఐదు రోజులుగా కొనసాగుతున్న నష్టాల పరంపరకు నేడు తెరపడింది.

రేపు ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ రానుండగా, జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో, స్టాక్ మార్కెట్ లావాదేవీలు ఆచితూచి నిర్వహిస్తున్న ట్రెండ్ కనిపిస్తోంది. అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు లాభపడగా... దివీస్ ల్యాబ్స్, నెస్లే, ఎల్టీఐ మైండ్ ట్రీ షేర్లు నష్టాలు చవిచూశాయి.


More Telugu News